2.71Cr | కేరళంలో ముగిసిన కమ్యూనిస్టుల‌ పాలన

2.71Cr | కేరళంలో ముగిసిన కమ్యూనిస్టుల‌ పాలన

2.71Cr | అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకంజ‌లో ఎల్‌డీఎఫ్‌

140 స్థానాలకు గానూ ఇప్పటికే 90స్థానాల్లో యూడీఎఫ్‌ లీడ్
కేవలం 47 స్థానాలకే పరిమితమైన ఎల్డీఎఫ్
కేరళంలో ఖాతా తెరిచిన బీజేపీ

కేర‌ళం మొత్తం స్థానాలు : 140
యూడీఎఫ్ : 90
ఎల్డీఎఫ్ : 47
బీజేపీ : 03

2.71 Cr | ఎల‌క్ష‌న్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కేరళం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్‌ ఎవరూ ఊహించని మెజార్టీ దిశగా దూసుకుపోతున్నది.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 140 నియోజకవర్గాల‌కు 90 చోట్ల కాంగ్రెస్ కూటమి లీడ్ లో ఉంది.. దీంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ముఖ్యమంత్రి కానున్నారు.. ముఖ్య‌మంత్రి పిన‌ర‌య్ విజ‌య‌న్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూట‌మి కేవ‌లం 47 స్థానాల‌కే ప‌రిమితం అయ్యింది. ఇక్క‌డ ఎల్డీఎఫ్ కూటమి ఓట‌మి పొంద‌డంతో దేశంలో క‌మ్యూనిస్టుల పాల‌న అంత‌మైన‌ట్లే.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కేరళంలో మాత్ర‌మే క‌మ్యూనిస్ట్ లు అధికారంలో ఉన్నారు. తాజా ఎన్నిక‌ల‌లో ఓట‌మి చెంద‌డం క‌మ్యూనిస్ట్ ల‌ను తీవ్ర నిరాశ ప‌రిచింది. బీజేపీ కూడా ఇక్క‌డ త‌న ఖాతాను తెరిచింది. ప్ర‌స్తుతం ఆ పార్టీ మూడు స్థానాల‌లో లీడింగ్ లో ఉంది.

కాగా ఈ ఎన్నిక‌ల‌లో ఓటర్లు పోటెత్తడంతో 79.63 శాతం భారీ పోలింగ్ నమోదైంది. మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఈసారి 883 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. ప్రధాన పార్టీలన్నింటికీ ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని ‘హ్యాట్రిక్’ విజేతగా చరిత్ర సృష్టించాలని అధికార ఎల్‌డీఎఫ్ కూటమి తహతహలాడింది. 2016 నుండి అధికారం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఈసారి ఎలాగైనా పీఠాన్ని దక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డింది.

కేరళలో తన ఉనికిని చాటుకుంటూ, ఓటు బ్యాంకును భారీగా పెంచుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గట్టి ప్రయత్నం చేసింది.మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. పోరు అత్యంత ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. స్వల్ప ఆధిక్యంతో యూడీఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. అయితే అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ యుడిఎఫ్ 90 స్థానాల‌లో లీడింగ్ లో ఏక‌ప‌క్షంగా విజ‌యం సాధించ‌నుంది.

CLICK HERE TO READ MORE : seats234 | ఆధిక్యంలో టీవీకే పార్టీ

CLICK HERE TO READ MORE