ఐదో వార్డులో నీటి వసతి కల్పించిన సర్పంచ్

జుక్కల్(కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని ఖండేబల్లుర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ చాకలికృష్ణ ఒక్కొక్కటిగా గ్రామ సమస్యలను పరిష్కారుస్తూ ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో గ్రామంలోని ఐదవ వార్డులో మంచినీటి కోరత ఉండటంతో దీనికి నివారించేందుకు సర్పంచ్ చాకలి కృష్ణ ఆదివారము నాడు బోరు బావిని త్రవ్వించారు.

బోరు మోటర్ కు పూజచేసి ప్రారంభించారు. పుష్కలంగా నీరు పడటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. బోరుబావికి విద్యుత్ మోటర్ బిగించి గల్లి వాసులకు నీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందని సర్పంచి చాకలికృష్ణా అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసి రామ్ చందర్ పటేల్, జ్ఞానేశ్వర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.