Bheemgal మహిళా సమాఖ్య సభ్యులకు జనపనార బ్యాగులు పంపిణీ

Bheemgal మహిళా సమాఖ్య సభ్యులకు జనపనార బ్యాగులు పంపిణీ

భీమ్‌గల్ రూరల్ (Bheemgal), ఆంధ్రప్రభ:

భీమ్‌గల్ మండలం మెండోరా గ్రామంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సమాఖ్య సభ్యులకు జనపనార బ్యాగులు పంపిణీ చేశారు.గ్రామ సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రామసభలో మహిళా సమాఖ్య సభ్యులకు మొత్తం 800 జనపనార బ్యాగులు అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళా సమాఖ్య అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కట్టుబడి ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో మహిళా సంఘాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా సమాఖ్య సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, నాయకులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం తదితరులు పాల్గొన్నారు.