నిజామాబాద్ ప్రతినిధి, మార్చి18 (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ లోని కంటేశ్వర్ బైపాస్ లో ఆదివారం కారు బాలుడిని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కారులో ఆరుగురు ఉండగా వారు క్షేమంగా బయటపడ్డారు.
కారు ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాల పాలైన షాహిజాద్ (11) ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందాడు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు 3వ టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు.