రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి..

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : రేషన్ కార్డుదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేయడం జరిగింది. ఇకనుండి ప్రతి కుటుంబ సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిర్ణీత గడువు లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయని లేని పక్షంలో రేషన్ సరఫరా నిలిపివేయడం, రేషన్ కార్డు రద్దు కావడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.అంతే కాకుండా పెన్షన్, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా ఆగిపోయే ప్రమాదం ఉందని సమాచారం.

ఈ-కేవైసీ పూర్తి చేయడానికి కుటుంబ సభ్యులు తమ ఆధార్ కార్డు,రేషన్ కార్డుతో సమీప రేషన్ దుకాణం లేదా గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లాలి. అక్కడ వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ ద్వారా సులభంగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవచ్చు.ఈ సేవ పూర్తిగా ఉచితమని అధికారులు వెల్లడించారు. వేలిముద్ర పని చేయని వారికి ఐరిస్ స్కాన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంచారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని, ఆలస్యం చేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మరియు స్టేటస్ చెక్ చేసుకోవడానికి జి.ఎస్.డబ్ల్యూ ఎస్ హెల్పేర్ పోర్టల్ వెబ్‌సైట్‌ను సందర్శించుకోవచ్చని సూచించారు.