భూపాలపల్లిలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

భూపాలపల్లిలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

  • పురుగుల మందు తాగిన డ్రైవర్..
  • ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ భూపాలపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన రవీందర్ అనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం పురుగుల మందు తాగిన రవీందర్‌ను సహచరులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.

తీవ్ర అస్వస్థతకు గురైన రవీందర్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల కాలంలో ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని సహచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు నలుగురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆర్టీసీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply