2days | రెండు రోజుల పాటు విచారణ..

2days | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విజయవాడ జైలు నుంచి దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది.
శాంతిని ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. ఈ విచారణలో కేసుకు సంబంధించిన మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇప్పటికే ఈ కేసులో లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అక్రమాలపై స్పష్టతకు రావడానికి అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.
