కనకదుర్గమ్మకు రూ.2.25 లక్షల విరాళం..
కనకదుర్గమ్మకు రూ.2.25 లక్షల విరాళం..
భార్య విశాలక్ష్మి జ్ఞాపకార్థం విరాళం అందజేసిన కిలారు రామ్మోహనరావు
ప్రసాద పంపిణీ, మల్లేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, గో సంరక్షణకు నిధులు
ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు విరాళం అందజేత
ఇంద్రాకిలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి పెనమలూరుకు చెందిన కిలారు రామ్మోహనరావు భక్తిశ్రద్ధలతో రూ.2.25 లక్షల విరాళాన్ని సమర్పించారు. తన భార్య కీ.శే. కిలారు విశాలక్ష్మి జ్ఞాపకార్థం ఆమె పేరున ఈ విరాళాన్ని అందజేశారు. దేవస్థానం వివిధ సేవా కార్యక్రమాల కోసం ఈ విరాళాన్ని అందించగా, ఉచిత ప్రసాద పంపిణీ పథకానికి రూ.1,25,000, శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.50,000 గో సంరక్షణకు మరో రూ.50,000 చొప్పున మొత్తం రూ.2,25,000 విరాళంగా సమకూర్చారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాముల సమక్షంలో దేవస్థాన చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ)కి విరాళాన్ని భక్తిపూర్వకంగా అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా దర్శనం అనంతరం వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా చైర్మన్ బొర్రా గాంధీ అమ్మవారి చిత్రపటం ప్రసాదం రసీదునా అందజేశారు
