బిఆర్ఎస్ కు అడుగడుగునా నీరాజనాలు…

బిఆర్ఎస్ కు అడుగడుగునా నీరాజనాలు…

  • వందలాదిగా ర్యాలీ ప్రదర్శన

వైరా, ఆంధ్రప్రభ : సమస్యలపై అవగాహన రాజకీయ స్పృహ కలిగిన చైతన్యవంతురాలు బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మాజీ యంపిపి కట్టా కృష్ణార్జున రావు సతీమణి కట్టా స్వరూప రాణి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వైరా మున్సిపాలిటీ పరిధిలోని 5,12 వార్డులో రోడ్ షో కార్యక్రమంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, సిపిఐ, సిపిఎం పార్టీల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంత్ రావు,పోతినేని సుదర్శన్ లు ఓటర్లను కోరారు.. వైరాలోని బస్టాండ్ ఎదురుగా పాత కూరగాయల మార్కెట్ వద్ద నుండి ప్రారంభమైన రోడ్ షో ప్రదర్శన ర్యాలీలో వందలాదిమంది నాయకులు కార్యకర్తలు ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డప్పు శబ్దాలతో బిఆర్ఎస్ పార్టీ హోరెత్తిన నినాదాలుతో రోడ్ షో విజయవంతమైంది.. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంత్ రావు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. సిపిఐ పార్టీ బలపరిచిన బిఆర్ఎస్ అభ్యర్థి కట్టా స్వరూప రాణిని ఐదో వార్డులో, 12వ వార్డులో మాదినేని సునీత లను అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు ఆకాంక్షించారు..

ఈ రోడ్ షో కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, కట్టా కృష్ణార్జున రావు, వనమా విశ్వేశ్వరరావు,వైరా మండల పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు అప్పం సురేషు, మిట్టపల్లి కిరణ్ కుమార్ నూకల వాసు వైరా మండల పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు అప్పం సురేషు, మాదినేని ప్రసాద్ వనమా చిన్ని, కామినేని శ్రీనివాసరావు, షేక్ లాల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply