MLA | అక్షర సత్యాలు ఆంధ్రప్రభ కథనాలు..

MLA | అక్షర సత్యాలు ఆంధ్రప్రభ కథనాలు..

  • ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాయం

MLA | బూర్గంపాడు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రభ దిన పత్రికలో వచ్చే కథనాలు అక్షర సత్యాలని పిలపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో శనివారం మండల సర్పంచుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకి ప్రభుత్వానికి వారేదిగా నిలబడుతూ ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంటూ తమ కలంతో గొప్ప గొప్ప కథనాలు రాస్తూ పాఠకుల మనసును దోసుకుంటున్న పత్రిక ఆంధ్రప్రభ పత్రిక అని అన్నారు.

సుమారు 8 దశాబ్దాలు పూర్తిచేసుకుని తొమ్మిదవ దశాబ్దంలోకి అడుగు వేయటానికి ఆంధ్రప్రభ పత్రిక సిద్ధంగా ఉందని నాటి నుండి నేటి వరకు మంచి ఆదరణ పొందుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేసుకుంటుందని అన్నారు. ప్రభుత్వ పథకాలను పేదలకు సక్రమంగా చేరేందుకు ఆంధ్రప్రభ కథనాలు కూడా దోహదపడుతున్నాయని తమ పని తమను గుర్తు చేసుకునేలా ఎప్పటికప్పుడు వార్తల ద్వారా మేలుకొలుపుతున్నారని ఆంధ్రప్రభ పత్రికలో పనిచేస్తున్న విలేకరులు అనుభవం కలిగిన వారిని అలాంటి పత్రిక 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుగ్గింపుడు కృష్ణారెడ్డి, పినపాక బి బ్లాక్ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బర్ల నాగమణి, జిల్లా మైనారిటీ సంఘం అధ్యక్షులు మహ్మద్ ఖాన్, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేష్ రెడ్డి, సర్పంచులు కిషోర్ శివరాం నాయక్, బాదం వెంకటేశ్వర్ రెడ్డి ,మంద నాగరాజు, బొర్రా సుభద్ర, తాటి లక్ష్మి, బొల్లి నిరోష, పూనం సురేందర్, శరపా నాగమణి, తాటి వాణి, వర్ష మంగమ్మ, బాణావత్ పద్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పా రాజు, కైపు రామచంద్ర రెడ్డి, కైపు శ్రీనివాసరెడ్డి,చిట్టి బాబు, తదితరులు పాల్గొన్నారు.