ఆలేరులో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని 1 వ వార్డులో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు శుక్రవారం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వాడిలో పోటీలో ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి చింతలఫణి సునీత శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో ఓటర్లను కలుసుకొని విజ్ఞప్తి చేశారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, నాయకులు పాల్గొన్నారు.