అమరవీరుల త్యాగాల స్మరణతో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

మహబూబాబాద్ జిల్లా కోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్ కె. వెంకన్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం న్యాయవాదులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాన్ని, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అమరవీరులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ వారికి నివాళులర్పించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోట రాంరెడ్డి, స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరదాసు వెంకటరత్నం, కార్యదర్శి సైదులు, న్యాయవాదులు వెంకన్న, నాగరాజు, శ్రీకాంత్, ప్రవీణ్, కోర్టు సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.

ఫొటో రైట్‌అప్: తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న కోర్టు సూపరింటెండెంట్ కె. వెంకన్న.

Leave a Reply