కొడంగల్ ఎత్తిపోతలకు సీడబ్ల్యూసీ క్లియరెన్స్ ఏది?

కొడంగల్ ఎత్తిపోతలకు సీడబ్ల్యూసీ క్లియరెన్స్ ఏది?

  • మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి

మక్తల్ , ఆంధ్రప్రభ ; కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సీడబ్ల్యూసీ ఉందా అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు .హడావిడిగా పనులను చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములకు ఇప్పటివరకు నష్ట పరిహారం చెల్లించడం లేదని అన్నారు. రైతు భూములన్నింటికీ ముందుగా నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు .విలువైన భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించకుండా పనులు చేపటం ఎక్కడి న్యాయమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కమిషన్ల కోసం కక్కుర్తి పడి పనులు చేపట్టడమే కాంగ్రెస్ అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంత డొల్ల అని అన్నారు. సరైనా నిధులు కేటాయించకుండా మాటల మీద లెక్కలు చూపించారని అన్నారు. గత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి మక్తల్ నారాయణపేట రోడ్డుకు 210 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డు వేస్తున్నామని శంకుస్థాపన చేశారని అన్నారు.

శంకుస్థాపన చేసి మూడు నెలలు దాటిన ఇప్పటికీ పనులు ప్రారంభించలేదని ఎప్పుడు పనులు చేపడతారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం నారాయణపేటకు వెళ్లాలంటే ప్రజలకు గుంతలమైన రోడ్డుతో ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా హమ్ పేరుతో 7500 కోట్లతో రాష్ట్రంలో రోడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. ప్రభుత్వం 40 శాతం నిధులు ఇస్తే కాంట్రాక్టర్ 60 శాతం నిధులు తో రోడ్డు పనులు చేయాల్సిన ఉందన్నారు.

దీంతో ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా రోడ్లు నిర్మించేందుకు ముందుకు రావడం లేదని అన్నారు. కాంట్రాక్టర్ 60 శాతం నిధులు సొంతంగా పెట్టుకొని రోడ్లు వేయడానికి ఎలా ముందుకు వస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రపోజల్ కాపీలను చూపించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ కమిషన్ల కోసం కక్కుర్తి పడి పనిచేస్తుందని అన్నారు .స్థానిక మంత్రి సమస్యలను పట్టించుకోవడంలేదని అన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం 101 గురుకులాలను ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ 25 ఎకరాల్లో నియోజకవర్గానికి ఒక పాఠశాల నిర్మిస్తామని హడావిడి చేశారే తప్ప ఎక్కడ రూపాయి కేటాయించలేదని అన్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వలేదని అన్నారు.

గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిందని ఆ గ్యారెంటీలకు వారంటీ లేకుండా పోయిందన్నారు. ఇచ్చిన 420 లలో మహిళలకు ఫ్రీ బస్సు తప్ప ఒక్క హామీ అమలు చేయలేదని అన్నారు. మంత్రులు బాగుపడుతున్నారే తప్ప రాష్ట్రం అభివృద్ధి కావడం లేదని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని విస్మరిస్తోందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అభివృద్ధి పై దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే చట్టం రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వనికి సూచించారు .ఈ విలేఖరుల సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.నరసింహ గౌడ్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిన్న హన్మంతు, నాయకులు అన్వర్ హుస్సేన్, మన్నాన్ ,చందాపూర్ అశోక్ కుమార్ గౌడ్, ఈశ్వర్ యాదవ్, జె. సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply