షెడ్లు మంజూరు చేయాలని వినతి..

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పవర్ గూడ భూసి మెట్ట గ్రామపంచాయతీలో గల హనుమాన్ మందిరాలకు, పీరీల మందిరాలకు షెడ్లు మంజూరు చేయాలని కోరుతూ శనివారం అసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఆయన నివాసంలో నాయకులతో కలిసి వినతి పత్రాలు సమర్పించినట్లు పవర్ గూడ, భూసి మెట్ట సర్పంచులు తొడసం రాజేందర్, సింధు నగేష్ లు వేర్వేరుగా వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు.
ప్రజా పాలన ప్రభుత్వం ద్వారా తమ గ్రామాలకు షెడ్లు మంజూరు చేసే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించినట్లు వారు తెలిపారు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఆమె ఇచ్చారని సర్పంచులు తెలిపారు దీంతో గ్రామపంచాయతీ ప్రజల తరఫున మాజీ ఎమ్మెల్యే యాత్రం సక్కుకు కృతజ్ఞతలు తెలిపినట్లు వారి పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కలిసిన వారిలో నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారని వారు తెలిపారు.
