వ్యవసాయ బావి వద్ద విద్యుత్ షాక్..
వ్యక్తి దుర్మరణం
కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూర్ గ్రామానికి చెందిన జీల నాగరాజు (46) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. సోమవారం ఉదయం తమ వ్యవసాయ బావి వద్ద విద్యుత్ మోటారును మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో ఆయన బావిలో పడిపోయి నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయాడు.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పెద్దూర్–కడెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నాగరాజు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నాగరాజు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
