Utkoor | కోర్టులోనే యధావిధిగా కొనసాగించాలి…

Utkoor | కోర్టులోనే యధావిధిగా కొనసాగించాలి…

Utkoor |ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఊట్కూర్ మండలాన్ని నారాయణపేట కోర్టు పరిధిలోనే యధావిధిగా కొనసాగించాలని ఊట్కూర్ మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు వడ్లమొనప్ప, పెద్ద జట్రం మాజీ సర్పంచ్ చిన్న సాయిలుగౌడ్, ఓబులాపూర్ మాజీ సర్పంచ్ భీమ్ రెడ్డి, బీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి, నాయకులు శివారెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు బీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా ఊట్కూర్ తాసిల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర రెడ్డికి పేట కోర్టు యధావిధిగా కొనసాగించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఊట్కూర్ మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న మక్తల్ సివిల్ కోర్టు పరిధిలోకి కాకుండా నారాయణపేట కోర్టు పరిధిలోయధావిధిగా కొనసాగించాలని కోరారు.

ఊట్కూర్ మండలంలోని చాలా గ్రామాలు నారాయణపేట జిల్లా కేంద్రానికి అనుసంధానంగా ఉండడంతోపాటు ప్రతినిత్యం వ్యవసాయ మార్కెట్, సబ్ రిజిస్టార్ తదితర పనులకు మండల ప్రజలు నారాయణపేటకు వెళ్తారనిఅన్నారు. ప్రభుత్వం కొత్తగా మక్తల్ పట్టణంలో సివిల్ కోర్టు ఏర్పాటు చేసి ఊట్కూర్ మండలాన్ని అందులో కల్పితే సహించేది లేదన్నారు. ఊట్కూర్ మండల ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని నారాయణపేట జిల్లా కోర్టుకు ఊట్కూర్ మండలాన్ని యధావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా ప్రజల ప్రయోజనం నాయకులు అధికారులు సౌకర్యంగా ఉన్న ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు ఇబాదూర్ రెహమాన్, తిమ్మప్ప, తరుణ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గంగాధర్ చారి, వెంకట్ రెడ్డి, రామలింగం గౌడ్ వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply