రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన

రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: ప్రజా పాలన ప్రగతి ప్రణాలిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” ప్రచారంలో భాగంగా మూడవ రోజు బుధవారం రఘునాథపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎస్ఐ డి. నరేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈసందర్బంగా సెయింట్ అల్ఫోన్సస్ పాఠశాలలో “పిల్లల రహదారి భద్రత అవగాహన” కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో, జీబ్రా క్రాసింగ్‌లను వినియోగించడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను తప్పనిసరిగా పాటించడం వంటి అంశాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో రహదారి భద్రతా నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్ల వినియోగాన్ని ప్రోత్సహించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే నిబద్ధత, సీట్ బెల్ట్ నియమాలను పాటించాలనే సంకల్పంతో తమ తల్లిదండ్రులకు లేఖలు రాయమని ప్రోత్సహించారు. అదే విధంగా సర్వీస్ రోడ్డుపై మానవహారం ఏర్పాటు చేసి, అనంతరం రహదారి భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించడం ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు.

Leave a Reply