ఘనంగా రవి చంద్ర పుట్టిన రోజు వేడుకలు..

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కుమారుడు, నియోజకవర్గ బిఆర్ఎస్ యూత్ నాయకుడు డిఎస్ రవిచంద్ర జన్మదిన వేడుకలు మండల మాజీ యూత్ అధ్యక్షుడు బండి రమేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు నోట్ బుక్స్ లను,చాక్లెట్లను పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని సామాజిక సేవా కార్యక్రమంలో ముందుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండబత్తిని జగదీశ్వర్,మాజీ ఉప సర్పంచ్ కర్ల నాగన్న,మాజీ వార్డ్ సభ్యులు ఎండి మాదారు హుస్సేన్ తదితరులు ఉన్నారు.