రీ సర్వే ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
రీ సర్వే ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
కోడూరు – ఆంధ్రప్రభ : కోడూరు మండల పరిధిలోని దింటి మేరక గ్రామంలో జరుగుతున్న రీ సర్వేను కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి రీ సర్వే గురించి అడిగి తెలుసుకున్నారు. రీ సర్వేకు రైతులంతా కూడా సహకరించాలని, ఖచ్చితత్వంతో సర్వే ను చేస్తున్నట్లు జెసి తెలిపారు.
దాదాపు అరగంట పైగా మండుటెండలో రైతులతో మాట్లాడి రీ సర్వే జరుగుతున్న విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులంతా కూడా ముందస్తుగానే సమాచారం ఇస్తున్నారని జాయింట్ కలెక్టర్కు తెలిపారు. ఇంచార్జ్ తాసిల్దార్ సౌజన్య కిరణ్మయి, రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్ పద్మప్రియ తో పాటు సర్వేయర్లు ,విఆర్వోలు పాల్గొన్నారు
