ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ

ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ
ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చెరువు కావాలన్నా ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన వన్ మంత్ ఫోర్ విజిట్ కార్యక్రమంలో శుక్రవారం నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టారు. సమస్యలపై చర్చించారు.

తాగునీరు, రహదారులు, పింఛన్లు, రెవెన్యూ, గృహ నిర్మాణం, విద్యుత్, సంక్షేమ పథకాలు తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను కలెక్టర్ దృష్టికి ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన “వన్ మంత్ – ఫోర్ విజిట్” కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు ఫిర్యాదుదారులు పాల్గొన్నారు.

Leave a Reply