నంద్యాల బ్యూరో, మార్చి 22 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లాలో శనివారం వైసీపీకి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గ పరిధిలో ఉన్న బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్ రెడ్డి (48) ని గుర్తుతెలియని వ్యక్తులు దారుణహత్య చేశారని పోలీసులు తెలిపారు.
ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ తెలిపిన వివరాల మేరకు… ఇవాళ ఉదయం తన పొలంలో పనులకు వెళ్తున్న నంద్యాల సుధాకర్ రెడ్డి దారుణహత్యకు గురయ్యారన్నారు. గ్రామంలో ఒక సామాజికవర్గంతో గత కొన్నేళ్లుగా ఓ వివాదం నెలకొని ఉందని తెలుస్తుందన్నారు. ఆ సమస్య నేటికీ పరిష్కారం కాలేదని పలువురు గ్రామస్తులు పేర్కొనటం విశేషం. వైసీపీకి చెందిన వ్యక్తి దేశం సుధాకర్ రెడ్డి తలపై మారణా యుధాలతో దాడి చేశారు. దీంతో అక్కడికక్కడే ఆయన మృతిచెందాడని పోలీసులు పేర్కొన్నారు. దేశం సుధాకర్ రెడ్డికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.