Srisailam Project | కరువు కోరల్లో రాయలసీమ…
శ్రీశైలం ప్రాజెక్టు జల సంరక్షణపై తక్షణ చర్యలు చేపట్టాలి…
ముఖ్యమంత్రికి రాయలసీమ సాగునీటి సాధన సమితి విజ్ఞప్తి..
Srisailam Project | నంద్యాల ప్రతినిధి, ఆగస్టు 3 ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాలకి తల మాణికమైన నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో సంరక్షించే ప్రతి టీఎంసీ నీటిని రాయలసీమ తాగునీటి భద్రతకు, రైతాంగ మనుగడకు శ్రీరామరక్ష అని ఇందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రత్యేక హామీ ఇవ్వాలని సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కార్యాలయంలో మాట్లాడరు.తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్న రాయలసీమలో తాగునీరు, పశువుల తాగునీరు, ఆరుతడి పంటలకు కనీస లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ అందించేందుకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణలో జల సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
కృష్ణా జలాల నిర్వహణలో శ్రీశైలం జలాశయం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో జాతీయ జల విధానం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014, బచావత్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలు, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ నియమావళి ప్రకారం తాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడం, తదుపరి పశువుల తాగునీరు, అనంతరం ఆరుతడి పంటలకు కనీస లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు.
గత వర్షాకాలంలో శ్రీశైలం జలాశయానికి 2 వెల టీఎంసీలకు పైగా వరద జలాలు వచ్చినప్పటికీ, విద్యుత్ ఉత్పత్తి పేరుతో పెద్దఎత్తున నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల జల సంరక్షణకు భంగం కలిగిందన్నారు.దాని ప్రభావమే ప్రస్తుతం రాయలసీమ ఎదుర్కొంటున్న తీవ్రమైన తాగునీటి, సాగునీటి సంక్షోభానికి ప్రధాన కారణమని ముఖ్యమంత్రికి విన్నవించారు.
