ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను పరిశీలించిన రాయల నాగేశ్వరరావు

ఇల్లెందు, ఆంధ్రప్రభ: ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పరిశీలకులు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం పరిశీలించారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియ పరిశీలనలో భాగంగా ఇల్లెందు పురపాలక పరిధిలోని 5వ వార్డులో వారు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. బీఎల్‌ఓలు అందించిన ఎన్యుమరేషన్ ఫారాలను పూరించే విధానం, ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎస్‌ఐఆర్ పరిశీలకుడిగా రాయల నాగేశ్వరరావు ఇల్లెందు నియోజకవర్గానికి రావడంతో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలిసి 5వ వార్డులో పర్యటించి ఓటర్లకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలకు పలు సూచనలు, సలహాలు అందిస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఇల్లెందు టౌన్ అధ్యక్షుడు బోళ్ల సూర్యం, స్థానిక కౌన్సిలర్ చిల్లా విజయభారతి శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యుడు మడుగు సాంబమూర్తి, కౌన్సిలర్ అజ్మీర వంశీ, ఉల్లింగ సతీష్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.