రాఘవేంద్ర చిత్రకళకు దక్కిన అరుదైన గుర్తింపు

రాఘవేంద్ర చిత్రకళకు దక్కిన అరుదైన గుర్తింపు

గట్టుప్పల, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ ఆధ్వర్యంలో 2026 నిర్వహించిన అఖిల భారత చిత్రకళా పోటీ, ప్రదర్శనలో మండల కేంద్రానికి చెందిన గంజి రాఘవేంద్ర జాతీయ స్థాయి చిత్రకళ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనలో దేశవ్యాప్తంగా పలువురు కళాకారులు పాల్గొనగా, ఎంపికైన చిత్రాల్లో రఘు రూపొందించిన కళాకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోచంపల్లి చేనేత చీరను సహజంగా వేలాడదీసినట్లుగా అద్భుతమైన రియాలిస్టిక్ శైలిలో చిత్రించిన ఈ కళాఖండం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది.

రంగుల వినియోగం, వస్త్రపు మడతలు, సహజత్వం వంటి అంశాలను నైపుణ్యంతో ప్రతిబింబించడంతో ఈ చిత్రం ఎంపిక చేయబడింది. ఈ విజయంపై కళాకారుడు రాఘవేంద్ర ఆనందం వ్యక్తం చేస్తూ.. నా కళను గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి వేదికలు యువ కళాకారులకు ప్రోత్సాహం కలిగిస్తాయని అన్నారు. ఈ ప్రదర్శనలో రాఘవేంద్ర వేసిన చిత్రం ఎంపిక కావడం పట్ల మిత్రులు శ్రేయోభిలాషులు, మండల ప్రజలు రాఘవేంద్రను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply