Rajapeta | ప్రజలు సమస్యలు పరిష్కరిస్తా..

Rajapeta | ప్రజలు సమస్యలు పరిష్కరిస్తా..

Rajapeta, ఆంధ్రప్రభ : ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తానని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఎర్ర గోకుల జశ్వంత్ అన్నారు. మంగళవారం రాజాపేటలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామపంచాయతీ ప్రజలు ఈసారి ఎన్నికల్లో ఆశీర్వదించి ఆదరిస్తే.. పంచాయతీ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు పలు హామీలు ఇచ్చారు.

ప్రజల సంక్షేమం కోసం, మౌలిక వసతుల కల్పన కోసం.. పాటుపడతానని ప్రచారంలో ప్రజలకు హామీలు ఇస్తూ ఆశీర్వదించాలని, తన గుర్తు ఉంగురంకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు సట్టు తిరుమలేష్, మదర్ డెయిరీ డైరెక్టర్ సందిల భాస్కర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు బెడిదే వీరేశం, నాయకులు గుఱ్ఱం నర్సింహులు, గజ్జెల రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply