Kadiyam Srihari | రాజీనామా యోచన లేదు..

Kadiyam Srihari | రాజీనామా యోచన లేదు..

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి


Kadiyam Srihari | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari) రాజీనామా చేస్తారని వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను శుక్రవారం కలవడం జరిగిందని తెలిపారు. విచారణకు మరికొంత సమయం కావాలని న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు కడియం పేర్కొన్నారు.

ఏ నిర్ణయం తీసుకున్నా నియోజకవర్గంలోని ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో చర్చించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటానని కడియం శ్రీహరి (Kadiyam Srihari) స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు రాజీనామా యోచన అయితే లేదని కడియం తెలిపారు.

Leave a Reply