Alwala | ఆశీర్వదించండి.. గెలిపించండి..

Alwala | ఆశీర్వదించండి.. గెలిపించండి..
Alwala, పెద్దమందడి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని అల్వాల గ్రామంలో గ్రామ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ప్రచారంలో దూసుకెళుతున్నారు. చదువుకున్న వ్యక్తి గ్రామ ప్రజల మధ్యలో ఉండి సేవలు అందించే వాళ్లని గ్రామానికి సర్పంచ్ గా ఎన్నుకోవాలని కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అన్నారు.
గ్రామ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. మన గ్రామ ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. ఎమ్మెల్యే మెగా రెడ్డి సహకారంతో మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను. మన గ్రామం అభివృద్ధి కావాలంటే.. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మి మోసపోవద్దు. మన గ్రామానికి కావాల్సిన అవసరాలు గుర్తించి ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతామన్నారు. గ్రామం లోని నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డు, ఇంద్రమ్మ ఇండ్లు, రైతులకు బోనస్ 200 యూనిట్లు విద్యుత్తు ఫ్రీగా ఇవ్వడం.. కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. మీ గ్రామం బిడ్డగా ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటు వేయాలన్నారు.
