ADB | చిన్నారుల‌తో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీస్ !!

బాసర, (ఆంధ్ర ప్రభ) : నిజామాబాద్ జిల్లా బోయి గల్లీకి చెందిన కోమటి గంగా ప్రసాద్ అనే వ్య‌క్తి తన పిల్లలతో కలిసి వంతెనపై నుండి నదిలోకి దూకడానికి ప్రయత్నించాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడేందుకు గోదావరి వంతెన వద్దకు వచ్చాడు కోమటి గంగా ప్రసాద్.

అయితే అక్క‌డే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మోహ‌న్ సింగ్ చాకచక్యంగా కోమటి గంగ ప్రసాద్ ను పిల్లలను పట్టుకొని యువకుడికి సర్ది చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడు. ఎస్ఐ గణేష్, పోలీసులు కుటుంబ సభ్యులతో కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఏవైనా సమస్యలు ఉంటే కుటుంబ సభ్యులు చర్చించుకుని పరిష్కరించుకోవాలని ఎస్ఐ గణేష్ సూచించారు. కోమటి గంగా ప్రసాద్ ని, అతని ఇద్దరు పిల్లలను కాపాడినందుకు కానిస్టేబుల్ మోహన్ సింగ్‌ను సీఐ మల్లేష్, ఎస్ఐ గణేష్, పోలీసులు, స్థానికులు అభినందించారు.

Leave a Reply