చినుకులకే జలమయం.. విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: మండలంలోని గూర్రేవుల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే రహదారి చిన్నపాటి వర్షానికే జలమయమవుతోంది. రోడ్డంతా వర్షపు నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బురద, నిల్వ నీటి మధ్యే విద్యార్థులు పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య పునరావృతమవుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిల్వ నీటిలో గుంతలు కనిపించక చిన్నారులు జారిపడే ప్రమాదం ఉందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి నీరు నిల్వ కాకుండా శాశ్వత చర్యలు చేపట్టి రహదారికి మరమ్మతులు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.