Rs. 15 crores | సుందరనగరంగా తీర్చిదిద్దుతా

Rs. 15 crores | సుందరనగరంగా తీర్చిదిద్దుతా
- రూ. 15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ఆర్టీసీ డిపో, డిగ్రీ కాలేజి, హై లెవల్ బ్రిడ్జి ఏర్పాటు చేయిస్తా
- తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్
Rs. 15 crores | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ ని సుందర నగరంగా తీర్చిదిద్దుతానని,ప్రజలు ఆశీర్వదించి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ,కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. ఈ రోజు మున్సిపల్ కేంద్రంలో రూ. 15 కోట్లతో గాంధీ నగర్, ఇందిరా నగర్, పద్మ శాలి కాలని, సుందరయ్య కాలనిలో చేపట్టిన సీసీ రోడ్లు, జంక్షన్ ఏర్పాటు, డ్రైనేజీ నిర్మాణ పనులకు, పాటిమట్ల- జటంగి బావి బి టి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సామెల్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అంగడి బజార్ రోడ్డు ను కొద్ది రోజుల్లో అద్దంలా తీర్చిదిద్దుతామని అన్నారు. మోత్కూర్ లో ఆర్టీసీ డిపో, డిగ్రీ కాలేజి, హై లెవల్ బ్రిడ్జి ఏర్పాటు చేయిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గుర్రం లక్ష్మీ నర్సింహారెడ్డి, అవిలిమల్లు, మున్సిపల్ కమిషనర్ కె సతీష్ కుమార్, పబ్లిక్ హెల్త్ డి ఈ మనోహర, ఏ ఈ సురేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగొని రామచంద్రు, తహశీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ బాలాజీ, మార్కెట్ డైరెక్టర్లు పన్నాల శ్రీనివాస్ రెడ్డి, జగన్, సమీర్, మాజీ సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, నాయకులు కారుపోతుల వెంకన్న, పల్లెర్ల వెంకన్న, స్వామి , గణగాని నర్సింహ, బుంగపట్ల యాకయ్య, ప్రమీల, జయశ్రీ, అన్నెపు పద్మ తదితరులు పాల్గొన్నారు.
