జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం

జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం

కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం వర్షం కురిసింది. ఏప్రిల్ నెల నుంచి మే 5వ తేదీ వరకు ఎండలకు ప్రజలు అల్లాడిపోయారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఉపశమనం కలిగిందని ప్రజలు పేర్కొంటున్నారు. పెడన, బంటుమిల్లి, ఘంటసాల, అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి, మచిలీపట్నం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండడంతో ప్రజలు హమ్మయ్య అనుకుంటున్నారు.

వేసవి ఎండలకు భయపడిన ప్రజానీకానికి ఒక్కసారిగా చల్లని వాతావరణం రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేడి గాలులు, ఉక్కపోతతో ఉదయం నుంచి రాత్రి వరకు పడిన కష్టాలకు వర్షం కురవడంతో పూర్తిగా ఉపశమనం లభించిందని తెలుపుతున్నారు. పలు అంతర్గత రహదారులు బురదమయంగా మారాయి. పలు పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా కురవడంతో ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.