ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందజేత

ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందజేత

కుంటాల, ఆంధ్రప్రభ : మండలంలోని అంబకంటి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను స్థానిక సర్పంచ్ ముజీగే రాణి ప్రదీప్ కుమార్ లు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదలకు సొంతింటి కల నెరవేర్చాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను అందించి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐదుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో వారికి మంజూరు పత్రాలను అందజేశారు. ప్రభుత్వానికి సైతం వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపు రాజు హౌసింగ్ ఏఈ శైలజ, వార్డు సభ్యులు రాజమణి, రమేష్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply