భూ సేకరణకు రైతులు సహకరించాలి: ఎమ్మెల్యే జీఎంఆర్

దేవరకద్ర, ఆంధ్రప్రభ: కోయిల్‌సాగర్ లెఫ్ట్ కెనాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో రైతులు సహకరించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ విజ్ఞప్తి చేశారు.

బుధవారం దేవరకద్ర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఇరిగేషన్ అధికారులతో కలిసి దాసరిపల్లి, అప్పంపల్లి, నాగారం, వెంకటయ్యపల్లి, పుట్టపల్లి, రాజోలి తదితర గ్రామాల రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సేకరణ ప్రక్రియపై రైతులకు వివరించి సహకరించాలని కోరగా, రైతులు సానుకూలంగా స్పందించారు.

అనంతరం దేవరకద్రలో ప్రారంభం కానున్న నూతన కోర్టు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. తర్వాత అనారోగ్యంతో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆది హనుమంత్ రెడ్డిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సోదరుడు భాస్కర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంజిల్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ దమయంతి గోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ యుగంధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరేష్ బాబు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.