ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు

ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు
-జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు
గద్వాల, ఆంధ్రప్రభ: త్యాగం, సహనం, సోదరభావానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు కోరారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగం, ప్రేమ, దయ, సోదరభావం వంటి గొప్ప మానవీయ విలువలను చాటిచెప్పే పవిత్రమైన పర్వదినమని పేర్కొన్నారు. ఈ పండుగను జిల్లా ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సుఖసంతోషాలతో, ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పండుగ వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.
