Purandeswari | కాకతీయ అపోలో విద్యాసంస్థల 40వ వార్షికోత్సవ వేడుకలు

Purandeswari | కాకతీయ అపోలో విద్యాసంస్థల 40వ వార్షికోత్సవ వేడుకలు

  • రెండో రోజూ ఘ‌నంగా కొన‌సాగాయి..
  • హాజ‌రైన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి

Purandeswari | నందిగామ, ఆంధ్రప్రభ : నందిగామలో కాకతీయ అపోలో విద్యాసంస్థల 40వ వార్షికోత్సవ వేడుకలు ‘మహోత్సవ్’ పేరుతో రెండో రోజూ ఘనంగా కొనసాగాయి. సుమారు 2,600 మంది విద్యార్థులు,(Students) వారి తల్లిదండ్రులు, వేలాది పూర్వ విద్యార్థులతో కార్యక్రమ ప్రాంగణం కళకళలాడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరుకాగా, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.

Purandeswari

Purandeswari | వేదికపై మాట్లాడిన తంగిరాల సౌమ్య..

కాకతీయ అపోలో విద్యాసంస్థల 40 ఏళ్ల ప్రయాణం ఘనమని ప్రశంసించారు. రవీంద్రనాథ్–భారతి కుటుంబం విద్యారంగంలో అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి నటరత్న ఎన్టీఆర్ (NTR) వారసత్వానికి నిలువెత్తు ప్రతిరూపమని, ఐదు భాషల్లో ప్రావీణ్యం కలిగిన నాయకురాలిగా పార్లమెంటులో ఆమె ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని తెలిపారు. కేంద్ర మంత్రిగా మానవ వనరుల అభివృద్ధి శాఖలో ‘రైట్ టు ఎడ్యుకేషన్’ వంటి కీలక నిర్ణయాల్లో ఆమె పాత్ర మరువలేనిదన్నారు. రెండో రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం మార్మోగగా, ఈ మహోత్సవాలు విద్యార్థుల జీవితాల్లో మధుర జ్ఞాపకాలుగా నిలవాలని ఆకాంక్షించారు.

Purandeswari

CLICK HERE TO READ వావ్​.. పీఠికాపురి Andhraprabha Live

CLICK HERE TO READ MORE