ipl12match | ఇవాళ గుజ‌రాత్‌, హైద‌రాబాద్ ఢీ

ipl12match | ఇవాళ గుజ‌రాత్‌, హైద‌రాబాద్ ఢీ

ipl12match |ఐపీఎల్‌లో నేడు 56వ మ్యాచ్‌
టేబుల్‌ టాప్‌-3లో ఇరు జ‌ట్లు
టాప్ ప్లేస్ కోసం ఈ రోజు ఫైట్‌
దూకుడు మీదున్న టూ టీమ్స్‌
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో..
రాత్రి 7.30గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం

ipl12match |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో ఇవాళ(మంగ‌ళ‌వారం) మ‌రో కీల‌క పోరు జ‌ర‌నుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్లు రాత్రి 7.30గంట‌ల‌కు తలపడనున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్‌కు తమ మార్గాన్ని సుగమం చేసుకోవాల‌ని ఇరుజ‌ట్లు భావిస్తున్నాయి. ప్రస్తుతం రెండు జట్లూ మంచి ఫామ్‌లో ఉన్నాయి. రెండు జ‌ట్లు పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్-3లో కొనసాగుతున్నాయి. అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా సహకరిస్తుంది. ప్లేఆఫ్ రేసును నిర్ణయించడంలో ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. సీజన్ ప్రారంభంలో తడబడినప్పటికీ, వరుస విజయాలతో కోలుకున్న శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం మెరుగైన స్థితిలో కనిపిస్తోంది. అలాగే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు కూడా అద్భుత‌ విజ‌యాలు సాధిస్తూ దూసుకుపోతోంది.

గుజ‌రాత్ జ‌ట్టులో గిల్‌, సాయి సుదర్శన్ జట్టుకు అద్భుత ఆరంభాలు అందిస్తున్నారు. జోస్ బట్లర్‌, వాషింగ్టన్ సుందర్ వంటి సీనియర్ల‌తో మిడిలార్డ‌ర్‌ బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలోనూ మొహమ్మద్ సిరాజ్‌, కాగిసో రబాడ తామ ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతుండగా.. రషీద్ ఖాన్ మధ్య ఓవర్లలో మ్యాచ్‌ను మలుపు తిప్పేస్తున్నాడు.

ఇక హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నాయకత్వం పెద్ద బలంగా మారింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దూకుడైన ఆటతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్‌లతో కూడిన మిడిలార్డ‌ర్ కూడా బ‌లంగా ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఎనిమిది సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు చేసింది. బౌలింగ్‌లో క‌మిన్స్‌, శ్రీలంక యువ పేసర్ ఈషాన్ మలింగ అద్భుతంగా రాణిస్తున్నారు. ఈషాన్ మలింగ ఈ సీజన్‌లో సంచలనంగా మారాడు. కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ ఇప్పటివరకు 16 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్లలో ఒకడిగా నిలిచాడు.

ఐపీఎల్ చ‌రిత్ర‌లో హైదరాబాద్‌పై గుజరాత్ మంచి రికార్డు కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు ఆరు సార్లు పోటీపడగా, అందులో ఐదు మ్యాచ్‌ల్లో గుజరాత్ విజయం సాధించింది. హైదరాబాద్ ఒక్కసారి మాత్రమే గెలిచింది.

Leave a Reply