జెన్ జీ డ్రామా – వైసీపీ కొత్త స్క్రిప్ట్..
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ – ఆంధ్రప్రభ : జెన్ జీ డ్రామా – వైసీపీ కొత్త స్క్రిప్ట్ అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. బుధవారం గుడివాడలో ఆమె మాట్లాడుతూ ట్రెండింగ్ చూసి రోడ్లెక్కే వైసీపీ అని ఎమ్మెల్యే రాము చురకలు వేసారు. జెన్ జీ అంటే వైసీపీకి అర్థం తెలుసా?, ప్రజల్లో ఏది ట్రెండింగ్ అయితే దాన్నే వైసీపీ ఫాలో అవుతుందన్నారు. పార్టీ నుంచి వచ్చేవాళ్లను జెన్ జీలు అనరు అని, వాళ్లు సమస్యల నుంచి స్వతంత్రంగా వస్తారన్నారు. జెన్ జీ పేరు అడ్డం పెట్టుకుని వైసీపీ రోడ్లెక్కి డ్రామాలు ఆడుతోందన్నారు.
16 వేల టీచర్ పోస్టులు ఇచ్చామని, వారంతా ఆనందంగా పని చేసుకుంటున్నారన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే కారణం లేకుండా లోకేష్ రాజీనామా కోరడం చూస్తే నవ్వు వస్తుందన్నారు. వైసీపీ గురించి మాట్లాడటమే అనవసరమన్నారు. ఈసారి జెన్ జీ పేరుతో రోడ్లు ఎక్కితే సర్టిఫికెట్స్ కూడా చూపించాలన్నారు. ఎన్ని సార్లు చీ కొట్టినా వైసీపీ బుద్ధి మారదన్నారు.
