Problem | దుర్వాస‌న మ‌టుమాయం

Problem | దుర్వాస‌న మ‌టుమాయం

Problem | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : వేసవిలో చాలామంది అధిక చెమటతో ఇబ్బంది ప‌డుతుంటారు. చెమ‌ట రావ‌డం మంచితే అయినా ఎక్కువ‌గా రావ‌డం వ‌ల్ల శ‌రీరం నుంచి దుర్వాస‌న వ‌స్తుంది. దీనివ‌ల్ల మ‌న‌కే కాదు.. ప‌క్క‌వారికి కూడా అసౌక‌ర్యం క‌లిగిస్తుంది. చాలా మంది ఈ శరీర దుర్వాసనను తగ్గించుకోవడానికి డియోడరెంట్స్, స్ప్రేలు వాడుతుంటారు. కానీ వాటి ప్రభావం కొన్ని గంటలు మాత్ర‌మే ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే చెమ‌ట స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Problem

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

  • ప్ర‌తీఒక్క‌రికీ వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త అవ‌స‌రం
  • రోజుకు రెండుసార్లు స్నానం చేస్తే మంచిది.
  • యాంటీ బాక్టీరియల్ స‌బ్బుల‌ను ఉప‌యోగించాలి.
  • దీని ద్వారా చర్మంపై ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది.
  • ఘాటైన వాసన వచ్చే ఆహారాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసాహారాన్ని తగ్గించాలి.
  • కాటన్ దుస్తులను ధరించడం వల్ల చెమట బాగా పీల్చుకుని, గాలి ఆడేలా చేస్తుంది.
  • స్నానం చేసే నీటిలో కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే మంచిది.
  • అలాగే స్నానం స‌మ‌యంలో చంకలలో బేకింగ్ సోడాను ఉపయోగించడం వల్ల దుర్వాసన తగ్గుతుంది.
  • ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరం చల్లబడి, విషపదార్థాలు బయటకు పోతాయి.
  • చంకలలో హెయిర్‌ను తొలగించడం వల్ల బ్యాక్టీరియా చేరే అవకాశం తగ్గుతుంది.
  • స్నానం చేసిన తర్వాత చంకలు, పాదాలు, చర్మం మడతలు ఉండే ప్రాంతాల్ని తడి లేకుండా పూర్తిగా తుడుచుకోవాలి.
  • డియోడరెంట్స్ వాడొచ్చు కానీ.. ఇవి కొన్ని గంటలు మాత్రమే ప్రభావం చూపిస్తాయి.
  • కారం ఎక్కువగా ఉండే పదార్థాలు, కెఫీన్ (కాఫీ, టీ), వెల్లుల్లి వంటి ఘాటైన వాసన వచ్చే ఆహార పదార్థాల్ని తగ్గించాలి.
  • తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం సహజమైన సమతుల్యతను కలిగి ఉంటుంది.
  • ఉక్కపోతగా ఉన్నప్పుడు లేదా చెమట పట్టిన వెంటనే బట్టలు మార్చుకోవడం మంచిది.
  • పాదాలకు పౌడర్లు లేదా ఫుట్ స్ప్రేలను ఉపయోగించడం ద్వారా దుర్వాసనను అరికట్టొచ్చు.
  • రోజంతా షూస్ వేసుకునే వారు కాటన్ సాక్స్‌లు మాత్రమే వాడాలి. వాటిని ప్రతిరోజూ మార్చాలి.
  • వీలైతే ఆఫీసులో ఉన్నప్పుడు కాసేపు షూస్ తీసి పాదాలకు గాలి తగిలేలా చూడండి.
Problem
Problem

CLICK HERE TO READ 30 years | చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే… పెద్ద సమస్యలకు దారితీయొచ్చు!

CLICK HERE TO READ MORE

Leave a Reply