పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్
వినతులు స్వీకరించిన బుద్ధా వెంకన్న
భవానిపురం,ఆంధ్రప్రభ: పశ్చిమ నియోజకవర్గం భవానిపురం , ఎన్డీయే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించి బాధితుల సమస్యలను ఓపికగా విని వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, వైద్య సహాయం కోసం వచ్చిన వినతులను స్వీకరించారు.. వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
బాధితులకు కూటమి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. 54 డివిజన్, వించి పేటకు చెందిన కమల్ ఖాన్ (51) హృద్రోగంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 6 లక్షల 50 వేల విలువైన ఎల్ ఓ సీ ను బుద్ధా వెంకన్న కూటమి నేతలతో కలిసి అందజేశారు. కూటమి నేతలు గుర్రం కొండ, కామ దేవరాజ్, మాజీ కార్పొరేటర్లు యేదుపాటి రామయ్య, పత్తి నాగేశ్వరరావు, తిరుపతి అనూష, తిరుపతి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
