కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి..

ఆలేరు, ఆంధ్రప్రభ : భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఆదివారం ఆ సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని విబిజి ఆర్ఎంఓ జి పేరుతో కొత్త బిల్లును తీసుకొని వచ్చిందన్నారు. పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీలో పని చేస్తున్న కూలీలను రెండు పూటలా ఫోటో తీసే విధానాన్ని రద్దు చేయాలని కోరారు.కూలీలకు 200 రోజులు పని కల్పించాలని రోజుకూలిన 600 రూపాయలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సవరించిన వ్యవసాయ కార్మికుల వేతనాలను అమలు చేసి గ్రామ సభలు నిర్వహించి పెరిగిన కూలిని రేట్లను గ్రామంలోని ప్రచారం చేయాలని సూచించారు.

50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు 7000 పింఛన్ ఇవ్వాలని అన్నారు.కూలీలకు పని ప్రదేశంలో తాగునీటి టెంట్లు ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్టు అందుబాటులో ఉంచాలని తెలిపారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలని అన్నారు. ఈ సమావేశం వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మండల అధ్యక్షుడు బొమ్మకంటి లక్ష్మీనారాయణ అధ్యక్షన జరిగింది. మిట్ట శంకరయ్య, కేతావత్ లక్ష్మి,పుట్టలరత్నం, చౌడబోయిన యాదగిరి, ఎలగందుల రాములు, జాలపు లక్ష్మి,మధ్య బోయిన ఉప్పలయ్య,రాజు పాల్గొన్నారు.