మోటార్లు దొంగతనానికి యత్నం

మోటార్లు దొంగతనానికి యత్నం

  • ఇద్దరు దొంగలను పట్టుకున్న గ్రామస్తులు

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామంలో మోటార్లు దొంగతనం చేసేందుకు వచ్చిన ఇద్దరు దొంగలను గ్రామస్తులు పట్టుకున్నారు.

ఇటీవల మోరంచ ప్రాంతంలో కరెంట్ వైర్లు, మోటార్లు దొంగతనాలు జరగడంతో అప్రమత్తమైన రైతులు గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి మరోసారి దొంగలు గ్రామంలోకి చొరబడగా, సీసీ కెమెరాల ద్వారా సమాచారం అందుకున్న గ్రామస్తులు వెంటనే అప్రమత్తమయ్యారు.

స్థానిక సర్పంచ్ సిపతి తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో రైతులు పంట పొలాల్లోకి వెళ్లి దొంగలను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారు పరకాల మండలం వరికోల్ గ్రామానికి చెందిన ఇద్దరని సమాచారం. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

Leave a Reply