కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చొరవ చూపాలి

కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చొరవ చూపాలి

  • భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు కర్ణాకర్

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : లక్ష్మీనరసింహస్వామి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. దౌల్తాబాద్ మండలం తిరుమలాపర్ లో కార్మికుల ఐక్యత కోసం జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా కార్మికుల హక్కులు, సంక్షేమం, ఐక్యత ప్రాముఖ్యతపై నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు యాకటి కరుణాకర్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే కార్మికులు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించగలరని తెలిపారు. ఈ వేడుకల్లో చెన్న సురేందర్, జడల రాజు, కమ్మరి బాలాచారి, రాపోలు స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply