సమగ్ర శిక్షా మహా పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ విద్యా వనరుల కేంద్రంలో సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు మే 15న నిర్వహించనున్న మహా పాదయాత్ర పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కె. జాన్ మోడీ మాట్లాడుతూ, సమగ్ర శిక్షా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు కుటుంబాలతో కలిసి భారీ సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్ వంటి ప్రధాన డిమాండ్ల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాటంలో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.