పేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి..
పేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి..
- బాధిత కుటుంబాలకు రూ. 12 వేలు, క్వింటా బియ్యం అందజేత
తొర్రూరు, ఆంధ్రప్రభ : పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ అధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిల సహకారంతో నిరుపేద కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మడిపల్లి మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు కిష్టాపురం గ్రామానికి చెందిన నకిరేకంటి స్వప్న, కంటయపాలెం చిలుక సారయ్య, పల్లె సోమలక్ష్మి, బొమ్మెర సోమక్కలు మృతి చెందడంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు జక్కా మహబూబ్ రెడ్డి, జక్క ఇంద్రసేనారెడ్డిలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి బాధిత కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున రూ.12 వేలు, ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల చొప్పున 1 క్వింటా బియ్యాన్ని అందజేశారు. బొమ్మెర సోమక్క కుటుంబ సభ్యులకు మహబూబ్ రెడ్డి స్ఫూర్తితో కంటయపాలెం 3వ వార్డు సభ్యులు పంజాల అల్లూరు 25 కేజీల బియ్యాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా మహబూబ్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని, ఝాన్సీ రెడ్డిల ఆశీస్సులతో మండలంలోని నిరుపేద బాధ్యత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తానన్నారు.పేదలకు ప్రతి ఒక్కరు అండగా నిలిచి ఆదుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అంది సంక్షేమ పథకాలు సకాలంలో అదే విధంగా కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నగరగంటి మాధవి సంపత్,ఉప సర్పంచ్ నగరగంటి సుజాత సుధాకర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడెల్లి రామచంద్రయ్య ,మడిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెన్నం సోమిరెడ్డి,మాజీ సర్పంచ్ లు రావుల వెంకటరెడ్డి,గడీల మాధవి సాయిలు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేల్పుల వెంకన్న, నాయకులు నకరికంటి వెంకన్న,వెంకటేశ్వర్లు,చల్ల మీనారెడ్డి, ఉపేందర్, మంద పూరి కుమార్, వీరస్వామి, సోమన్న,ఎండి జైరుద్దీన్,మహంకాళి సంపత్, ఉదయ్ కుమార్, మురళి యాదవ్,వెంకటాచారి,యర్రం రాజు యాదవ్, సంపత్,వెంకన్న, వెంకన్న, మధు, ఆంజనేయులు, శ్రీనివాస్, ప్రవీణ్ ప్రభాకర్, రమేష్ ,అంజయ్య,చిన్న సంపత్ తదితరులు పాల్గొన్నారు.
