Police | సీఐ శ్రీనివాస రెడ్డికి ప్రశంస పత్రం పురస్కారం

Police | సీఐ శ్రీనివాస రెడ్డికి ప్రశంస పత్రం పురస్కారం

Police | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పోలీస్ శాఖలో విశేష సేవలందించిన రఘునాథపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) ఎడబెల్లి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం ప్రశంస పత్రం పురస్కారంతో గౌరవించింది. ఈ రోజు జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా, జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఆయన ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. పురస్కారం అందుకున్న అనంతరం సీఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో వృత్తిపరమైన నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ప్రజలకు మరింత చేరువగా ఉండి సేవలు అందిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.