మీ బిడ్డగా వస్తున్న ఆశీర్వదించి గెలిపించండి
మీ బిడ్డగా వస్తున్న ఆశీర్వదించి గెలిపించండి
- 12వ వార్డు అభ్యర్థి వంగ ఉమ యుగంధర్
జనగామ, ఆంధ్రప్రభ : 12వ వార్డులో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలుకు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని మీ బిడ్డగా ఎన్నికల్లో నిలిచానని ఆశీర్వదించి గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి వంగ ఉమ యుగేందర్ అన్నారు. శుక్రవారం 12వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజలతో మమేకమై పలు విషయాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ వార్డులో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ సమస్యల పరిష్కారంతోపాటు స్వచ్ఛందంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.
వార్డులో ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని, రోడ్లు మరమ్మతు చేయడం, రైల్వే అండర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయడం లాంటి పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వార్డులో అనేక కుటుంబాల్లో పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తదితర అవసరాలు ఉన్నాయని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని జనగామ మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని నిధులతో వార్డులో అనేక అభివృద్ధి పనులు చేపడతామని వారు వివరించారు. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు మండల నాయకులు వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
