మొక్కల పెంపకమే పర్యావరణ పరిరక్షణకు మార్గం

మొక్కల పెంపకమే పర్యావరణ పరిరక్షణకు మార్గం

  • అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు

కడెం, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని నిర్మల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కడెం మండలంలోని దిల్దార్‌నగర్ గ్రామంలో శ్రీ అక్కకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బద్దెనపల్లి స్టీఫెన్, డీఆర్‌డీఓ విజయలక్ష్మితో కలిసి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పలు పండ్ల మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొక్కలు నాటడమే కాకుండా వాటిని రక్షించి పెంచడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కడెం ఎంపీడీవో అరుణ, ఎంపీఓటీ శ్రీనివాస్, ఈజీఎస్ ఏపీఓ జయదేవ్, ఆలయ కమిటీ చైర్మన్ కె. లక్ష్మణ్, ఉపసర్పంచ్ ఆనంద్ గౌడ్, వీడీసీ అధ్యక్షుడు కొండాడి జగ్గారావు, పంచాయతీ కార్యదర్శి భూమేష్, ఆలయ కమిటీ సభ్యులు, జీబీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోల శ్రీనివాస్, కమలాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.