20Km-Cycle-Ride సూపర్​ నిమ్మల.. Andhra Prabha Top Bews

20Km-Cycle-Ride సూపర్​ నిమ్మల.. Andhra Prabha Top Bews

  • మండుటెండలో చమటోడ్చి మరీ..
  • అమరావతికి రయ్​ రయ్​
  • ఏక్​ ధమ్​ 20 కి.మీ సైకిల్ సవారీ
  • ఫిట్‌నెస్, పర్యావరణ పరిరక్షణకు మంత్రి సందేశం
  • సైకిల్ సవారితో ఆకట్టుకున్న నిమ్మల
  • అమరావతిలో గ్రీన్ డ్రైవ్‌కు శ్రీకారం
  • ఉద్యోగులతో కలసి మొక్కలు నాటిన మంత్రి నిమ్మల.
  • జలవనరుల శాఖ మంత్రి నిమ్మల సైకిల్​ జోరు

( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్​ బ్యూరో )

20Km-Cycle-Ride మానవ మనుగడకు ఎంతో కీలకమైన భూమి, నీరు, గాలిని కలుషితం కాకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి అమరావతి సచివాలయంకు 20 కి.మీ సైకిల్ తొక్కుకుంటూ వచ్చి తన విధులకు హాజరయ్యానని తెలిపారు రాష్ట్రజలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శుక్రవారం విజయవాడలో తన క్యాంపు కార్యాలయం నుండి సైకిల్ పై బయలుదేరిన మంత్రి నిమ్మల రామానాయుడు మార్గమధ్యంలో కొండవీటి వాగు దగ్గర ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జలవనరుల శాఖ ఉద్యోగులతో కలసి మొక్కలు నాటారు. అనంతరం సచివాలయంకు బయలు దేరిన మంత్రి సీడ్ యాక్సస్ రోడ్డులో మొక్కల పని చేస్తున్న మహిళా కూలీల దగ్గర ఆగి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

20Km-Cycle-Ride : చమటోడ్చి మరీ.. ..

అనంతరం సచివాలయంకు చేరుకున్న మంత్రి నిమ్మల, డీజిల్, పెట్రోల్, విద్యుత్ వాడకం తగ్గించాలి, పొదుపు పాటించాలి, దుబారాను తగ్గించేందుకు, కాన్వాయ్ ను, ఎస్కార్ట్ ను తగ్గించుకుని , ప్రజా ప్రతినిధులు ఆదర్శంగా ఉండాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపిచ్చారని తెలిపారు. అందుకే ప్రతి శుక్రవారం , నో వెహికల్ డే గా పాటించాలని సూచించారని, అందులో భాగంగానే గత రెండు శుక్రవారాలు కూడా సైకిల్ పైనే తన విధులకు హజరైన మంత్రి నిమ్మల, ఈ మూడో శుక్రవారం కూడా సైకిల్ పై వచ్చి తన విధులకు హాజరయ్యానని స్పష్టం చేశారు.

20Km-Cycle-Ride అక్కడ సీఎం.. ఇక్కడ నిమ్మల

పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి, జీవరాశిని రక్షించుకోవాలనే ఆలోచనతో , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తన విశాఖ పర్యటనలో ఆంధ్రా యూనివర్శిటీ నుండి తన మీటింగ్ ప్రదేశం అయిన నోవాటెల్ వరకు మండుటెండలో 11 కి.మీ సైకిల్ తొక్కుతూ వెళ్ళారని అన్నారు. తిరుగు ప్రయాణంలో కూడా 11 కి.మీ సైకిల్ పై వచ్చారని, ప్రజా ప్రతినిధులు మాటలు చెప్పేదాని కంటే , చేతల ద్వారా చేసి చూపిస్తేనే, ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుందనే ఆలోచనతోనే ఈచిరు ప్రయత్నం చేశారని తెలిపారు. ఈరోజు చేసిన ఈ చిరు ప్రయత్నమే పెద్దమార్పుకు నాంది కానుందని పేర్కొన్నారు. ఈవిధంగా నాయకులు ఆచరించి చూపించడం వల్ల భవిష్యత్ లో ప్రజల్లో కూడా పెద్ద మార్పుతీసుకొస్తుందనే ఆశాభావంతోనే తాను సైతం ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.

ALSO rEAD : Cm-Cycle-Ride : ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. Andhra Prabha Top News