Plantation | పర్యావరణాన్ని కాపాడుకుందాం
Plantation | పర్యావరణాన్ని కాపాడుకుందాం
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Plantation | ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘ఏక్ పేడ్ మాకే నామ్’ (తల్లి పేరిట ఒక మొక్క) పిలుపు మేరకు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో తన మాతృమూర్తి పేరిట ఒక మొక్కను నాటారు. ఈ మేరకు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ తల్లులను గౌరవించుకుంటూ వారి పేరు మీద మొక్కలు నాటి, చెట్లు పెంచాలని ఆయన సూచించారు.
పర్యావరణాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించాలంటే విస్తృతంగా మొక్కలు నాటడం అవసరమని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లోనైనా కనీసం ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
