బాపట్ల పార్లమెంట్ టీడీపీ కార్యాలయ నిర్మాణ పనుల పరిశీలన..

బాపట్ల, ఆంధ్రప్రభ: బాపట్ల మండలం వెదుళ్లపల్లి హైవే సమీపంలో నిర్మాణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ నూతన కార్యాలయాన్ని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పరిశీలించారు.

ఈ సందర్భంగా కార్యాలయ నిర్మాణ పనులను సందర్శించిన ఎమ్మెల్యే, నిర్మాణ పురోగతి, చేపడుతున్న పనుల నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి, త్వరలోనే పార్టీ కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

బాపట్ల పార్లమెంట్ పరిధిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, సమన్వయానికి ఈ కార్యాలయం కేంద్రంగా ఉపయోగపడనుందని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిర్మాణ పనులపై చర్చించారు.

Leave a Reply